జీఎస్టీ తగ్గింపు.. రాష్ట్రంలో పెరిగిన వాహనాల విక్రయాలు
AP: GST తగ్గింపుతో రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత 30 రోజుల్లో 1.47 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో 99,972 విక్రయిస్తే.. ఈసారి 47,953 ద్విచక్ర వాహనాలు అధికంగా అమ్ముడవ్వటం గమనార్హం. అలాగే గత 30 రోజుల్లో 12,895 కార్లు అమ్ముడయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అమ్మకాల వల్ల రాష్ట్ర ఖనాజాకు రూ.616.39 కోట్ల ఆదాయం వచ్చింది.