VIDEO: 'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'
ADB: ప్రజలందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తాంసి ఎస్సై జీవన్ రెడ్డి కోరారు. మండలంలోని కప్పర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. MPDO మోహన్ రెడ్డి, DSP మధు మోహన్ రెడ్డి, తదితరులున్నారు.