విలువిద్యలో బంగారు పతకం సాధించిన సింధుజ

విలువిద్యలో బంగారు పతకం సాధించిన సింధుజ

KMR: దోమకొండకి చెందిన క్రీడాకారిణి సింధుజ ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన విలువిద్య పోటీలలో పాల్గొని బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా ఆమెను సోమవారం మండల కేంద్రంలో జిల్లా విలువిద్య అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల గౌడ్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యతనిచ్చి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సింధుజకు సూచించారు.