అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు

అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు

ప్రకాశం: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మార్కాపురంలోని పలు అపార్ట్‌మెంట్లలో గురువారం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే వాటి నుంచి ఏ విధంగా ప్రాణాలను కాపాడుకోవాలి, ఇతరులను ఏ విధంగా రక్షించాలి అనే అంశాలపై మాక్ డ్రిల్ చేసి చూపించారు. అగ్ని భద్రతపై సమాచారం ఇవ్వాలని ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ సూచించారు.