'మెరుగైన వైద్య సేవలు అందించాలి'

ADB: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అదనపు వైద్యాధికారి డా.మనోహర్ అన్నారు. గురువారం నార్నూర్ మండల కేంద్రంలోని CHC ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం సిబ్బంది రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా.జితేంద్ర రెడ్డి, తులసీదాస్, నాందేవ్, చరణ్ దాస్ ఉన్నారు.