వైసీపీ తరఫున రూ.5 లక్షల చెక్కు అందజేత
ASR: దివంగత కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజు కుటుంబానికి వైసీపీ తరఫున మాజీమంత్రి అమర్నాధ్ రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఆదివారం చిట్టెంపాడులో నూకరాజు సంతాప సభ నిర్వహించారు. జడ్పీ ఛైర్ పర్సన్ సుభద్ర, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం, అరకు ఎంపీ తనూజారాణి తదితరులు పాల్గొన్నారు. అమర్నాధ్‌తో కలిసి బాధిత కుటుంబానికి చెక్కును అందించారు.