ప్రత్తిపాడు మండలంలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి

ప్రత్తిపాడు మండలంలోకి ఎంట్రీ  ఇచ్చిన పెద్దపులి

కాకినాడ: శంఖవరం మండలం నుంచి పెద్దపులి మళ్లీ ప్రత్తిపాడు మండలంలోకి వచ్చిందని అటవీ అధికారులు గుర్తించారు. బౌరువాక, తాడువాయి, రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులిని పట్టుకునేందుకు 11 హనుమాన్ బృందాలు, 3 ట్రాంక్విలైజింగ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ బృందాలు అడవిలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు.