అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఆచంట

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఆచంట

W.G: ఆచంట ప్రాంతం జూదం, కోడి పందేలకు అడ్డగా మారిందని ఆరోపణలొస్తున్నాయి. మార్టేరు, కవిటం, సిద్ధాంతం, పెనుగొండ, పోడూరు వంటి ప్రాంతాల్లో ఈ క్రీడలు యథేచ్ఛగా జరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు. నిర్వాహకుల నుంచి భారీగా మాముళ్లు అందుతున్నందున యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికారులు ఇకనైన స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.