'100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతంగా చేయాలి'

'100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతంగా చేయాలి'

SRPT: కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులపై ఎమ్మెల్యే పద్మావతి సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల్లో జాప్యం లేకుండా, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.