ఘనంగా NSUI ఆవిర్భావ దినోత్సవం
BHNG: 56వ NSUI ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ అస్పత్రిలో పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళపెల్లి శ్రీవాణి విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యా రంగంలో పారదర్శకత, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం NSUI ప్రధాన లక్ష్యం అన్నారు.