బాలీవుడ్ ‘రామాయణం’ లో మరో బిగ్ స్టార్

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామాయణం'. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రామాయణంకు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇందులో ఒక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.