ఢిల్లీలో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

ఢిల్లీలో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

తెలంగాణ ఈగల్ టీమ్ ఢిల్లీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో అధికారులు రూ. 12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో మొత్తం 16 డ్రగ్స్ విక్రయ కేంద్రాలను గుర్తించి.. పలువురిని అరెస్ట్ చేశారు. ఢిల్లీతో పాటు నోయిడా, గ్వాలియర్, విశాఖలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ డ్రగ్స్ దందా నైజీరియాకు చెందిన నిక్కీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.