గన్నవరం అబ్బాయికి మెక్సికో అమ్మాయితో పెళ్లి

గన్నవరం అబ్బాయికి మెక్సికో అమ్మాయితో పెళ్లి

కృష్ణా: ప్రేమకు సరిహద్దులు లేవని మరోసారి రుజువైంది. గన్నవరం మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి యశ్వంత్ మెక్సికో యువతితో వివాహ బంధంలో ఒక్కటయ్యారు. మెక్సికోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఓ మహిళా డాక్టర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది.