VIDEO: పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

VIDEO: పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

MDK: వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ సూచించారు. పిల్లలు సరదాగా చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. మద్యం మత్తులో ఈతకు వెళ్లడం ప్రమాదకరమని, ఈత వచ్చిన వారైనా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.