ఈనెల 3న కొత్తవలస మేజర్ పంచాయితీ గ్రామ సభ
VZM: ఈనెల 3న కొత్తవలస మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సచివాలయంలో గ్రామ సభ నిర్వహించబడునని కొత్తవలస మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు హాజరై ఫిర్యాదులపై దరఖాస్తు చేసుకోవచ్చని దాన్ని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.