శ్రీకాకుళం సబ్-డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్
శ్రీకాకుళం సబ్-డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు చేస్తున్నామని డీఎస్పీ CH వివేకానంద శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు చేయడం నిషేధమన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.