ట్రాఫిక్ నియమాలపై అవగాహన

ట్రాఫిక్ నియమాలపై అవగాహన

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ట్రాఫిక్ ఎస్సై పాపారావు మంగళవారం ఆర్టీసీ కూడలిలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే డ్రైవింగ్ సమయంలో వాహన పత్రాలు వెంట ఉండాలన్నారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్స్ వినియోగించకూడదని కోరారు.