కాటంరాజు తిరునాళ్ల శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

ప్రకాశం: పెద్దారవీడు మండలం గుండంచర్లలో జరుగుతున్న శ్రీ గంగా భవాని సామెత వేణుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అకాంక్షిస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. శనివారం జరుగుతున్న తిరునాళ్లలో వైసీపీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.