కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి
NGKL: తిమ్మాజీపేట మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కుక్కలు దాడి చేయడంతో మేకల శ్రీశైలంకు చెందిన 25 గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. దీంతో గొర్రెల కాపరి శ్రీశైలం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అధికారులు కుక్కలను పట్టుకొని, వాటి దాడుల నుంచి విముక్తి కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.