వైద్యులు అందుబాటులో ఉన్నారు.డి.ఏం.హెచ్. ఓ

వైద్యులు అందుబాటులో ఉన్నారు.డి.ఏం.హెచ్. ఓ

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి పి.హెచ్ సి కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేరంటూ వచ్చిన వార్తకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు గురువారం స్పందించారు. ఓ పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. పి.హెచ్ సి కేంద్రంలో ఇద్దరు వైద్యులు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల ఒకటో తేదీన కూడా విధుల్లో ఉన్నట్లు స్పష్టం చేశారు.