VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం

NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఉన్న యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టడంతో కారులో మంటలు చేలరేగాయి. దీంతో చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు.