అప్పులు తీర్చలేక దంపతులు ఆత్మహత్య
RR: అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి ఠాణా పరిధిలో జరిగింది. యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన భార్యభర్తలు HYD కొత్తపేటలో నివాసం ఉంటూ కూరగాయాల వ్యాపారం చేసేవారు. వడ్డీకి తెచ్చిన అప్పలు తీర్చలేక మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.