ప్రమాదకరంగా మారిన గుంత

ప్రమాదకరంగా మారిన గుంత

KDP: బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ గుంత ప్రమాదకరంగా మారింది. లెట్రిన్ వేస్టేజ్ బ్లాక్ కావడంతో మున్సిపల్ అధికారులు మూడు నెలల కిందట గుంత తవ్వారు. దానిని పూడ్చకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం ఓ గేదె అందులో పడిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మనుషులకు ప్రమాదాలు జరగకముందే గుంత పూడ్చాలని కోరుతున్నారు.