ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 20 కాన్పులు

ప్రభుత్వ ఆసుపత్రిలో  24 గంటల్లో 20 కాన్పులు

NGKL: కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన 24 గంటలలో 20 కాన్పులు జరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. ఇందులో 11 నార్మల్ డెలివరీలు, 9 సిజేరియన్ కాన్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విజయవంతంగా కాన్పులు చేసిన ఆసుపత్రి సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించారు.