'రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణాలకు కారణం కావద్దు'

'రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణాలకు కారణం కావద్దు'

SRPT: ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే విధంగా రోడ్లపై ధాన్యాన్ని ఎండబెట్టడం చట్టవిరుద్ధమని, అలా చేసే రైతులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఉన్న రైతులు తమ ధాన్యాన్ని పొలాల దగ్గరే ఆరబెట్టుకోవాలని రైతులకు సూచించారు..