ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన కలెక్టర్
కోనసీమ: సమాజంలో వెనుకబడిన వర్గాలకు, వృద్ధులకు, వికలాంగులకు భరోసా కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జిల్లా వ్యాప్తంగా జరుగుతోందని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. మోడీకుర్రులో ఆయన చేతుల మీదుగా ఒక వితంతు, 3 వయోవృద్ధ పింఛన్లు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. NTR భరోసాతో పేదలకు సామాజిక ఆర్థిక భద్రత చేకూరుతుందన్నారు.