శత శాతం హాజరు తప్పనిసరి: ఎంఈవో
SKLM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శత శాతం ఉండే విధంగా కృషి చేయాలని ఎంఈవో బమ్మిడి మాధవరావు తెలిపారు. సోమవారం జలుమూరు మండలం చల్లవానిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సందర్శించారు. స్థానిక ఉపాధ్యాయుడు చౌదరి రవికుమార్‌తో మాట్లాడుతూ.. తప్పనిసరిగా విద్యార్థులు అంతా సమయానికి పాఠశాలలకు చేరుకునే విధంగా చూడాలన్నారు. హోంవర్క్ లను తనిఖీ చేయాలన్నారు.