హరీష్ రావు ఇంటికి మాజీ డీజీపీ అంజనీకుమార్

హరీష్ రావు ఇంటికి మాజీ డీజీపీ అంజనీకుమార్

TG: మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. అయితే ఇటీవల హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చిత్రపటానికి అంజనీకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హరీష్‌కు ధైర్యం చెప్పారు.