చివరికి వారే దిక్కయ్యారు: మహ్మద్‌ కైఫ్‌

చివరికి వారే దిక్కయ్యారు: మహ్మద్‌ కైఫ్‌

టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌లో రాణిస్తేనే భారత్ గెలుస్తోందన్నాడు. యువ బ్యాటర్లెవరూ ప్రభావం చూపడం లేదని, చివరికి మళ్లీ రోహిత్‌, కోహ్లీలే టీమిండియాకు దిక్కయ్యారని అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్లకు జట్టులో పెద్ద సంఖ్యలో చోటు కల్పించినా 200 పరుగులు కూడా చేయలేకపోతున్నారని తెలిపాడు.