VIDEO: 'తాటి చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'తాటి చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి'

WGL: పర్వతగిరి మండలం రావూరులో గౌడ కులస్తులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూమిలో ఉన్న తాటివనాన్ని తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గురువారం ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబరు 32A/2 లో కోటివరాల పథకంలో భాగంగా 2005 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రెండు ఎకరాల భూమి కేటాయించిందని పేర్కొన్నారు. 18 తాటి చెట్లను తొలగించారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.