తండ్రి మంద‌లించాడ‌ని యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

తండ్రి మంద‌లించాడ‌ని యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

MBNR: నవాబుపేట మండలం పరిధిలోని గురుంట్ గ్రామంలో బోవళ్ల గణేష్ (21) ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్ హోలీ పండుగ నాడు స్నేహితులతో గొడవ పడ్డాడు. దీనిపై శుక్రవారం తండ్రి మందలించడంతో రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబీకులు శనివారం గాలించగా తమ పొలంలోని షెడ్డులో ఉరేసుకున్నట్లు గుర్తించారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.