నేడు జిల్లాలో జాబ్ మేళా
KRNL: జిల్లాలో ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి దీప్తి బుధవారం తెలిపారు. ఈ మేళాలో రిలయన్స్ కన్స్యూమర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఖాళీలు 120 ఉన్నాయనీ, ఐటీఐ/డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. యువత ఎన్సీఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.