రోడ్లపై పశువులను వదిలే యజమానులపై కఠిన చర్యలు
PDPL: రోడ్లపై పశువులను వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు, మంథని పురపాలక కమిషనర్ మనోహర్. ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 1 నుంచి పశువులను రోడ్లపై వదిలితే రూ.10,000 జరిమానా విధించి వాటిని గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. పశువుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నందున యజమానులు తమ పశుసంపదను ఇంటి ఆవరణలో కట్టేసుకోవాలని పురపాలక సంఘం విజ్ఞప్తి చేసింది.