తిరుపతి జూపార్కు రూ.97 లక్షల సాయం
తిరుపతిలోని SV జూలాజికల్ పార్క్ అభివృద్ధికి టీటీడీ నుంచి రూ.97 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.జంతువుల భద్రత,సందర్శకుల సౌకర్యాల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు.బోర్డు తీర్మానం 474కి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ను ఆదేశించింది.