తిరుపతి స్మార్ట్ సిటీ పనుల పురోగతి సమీక్ష
TPT: తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, నగరపాలక కమిషనర్ ఎం.మౌర్య, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సంబంధిత అధికారుల పనితీరు, పూర్తి అయిన, మిగిలిన పనుల వివరాలను పరిశీలించి, తదుపరి దశల కోసం ఆదేశాలు ఇచ్చారు.