సత్యవోలు అగ్రహారంలో వింత సంఘటన..!

సత్యవోలు  అగ్రహారంలో వింత సంఘటన..!

NLR: కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం పంచాయతీలోని ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. సత్యవోలు గ్రామస్తుడు పరుచూరి నాగేశ్వరరావు గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం గొర్రెల మందలో ఒక గొర్రెకు 8 కాళ్లతో గొర్రె పిల్ల జన్మనిచ్చింది. ఈ వింత సంఘటన చూసేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తండోపతండంగా తరలివచ్చారు. జన్య సమస్య వల్ల ఇలా జరుగుతుంది అని వైద్యులు తెలిపారు.