కేఆర్‌సీ పురం పాఠశాలలో ఘనంగా 'బడిబాట'
SRPT: నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి చక్రాల ఉమా, పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.