'ఓటు ఒక ఆయుధం సరైన వ్యక్తిని ఎన్నుకోండి'
BDK: భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ విజయమే లక్ష్యంగా ఇవాళ ఇంటింటా ప్రచారం కొనసాగించారు. సీపీఎం, జీడీపీ పార్టీల మద్దతుతో తన సిద్ధాంతాలను నమ్మి భద్రాచలం ప్రజలు అందరూ ఒక తాటిపై వచ్చి తనను ఆశీర్వదించాలని కోరారు. ఓటు ఒక ఆయుధమని సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే గ్రామానికి నష్టం జరుగుతుందన్నారు.