నేడు కొమరోలు మండలంలో ఉచిత వైద్య శిబిరం

ప్రకాశం: కొమరోలు మండలంలోని కసినేపల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ నరసయ్య తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వైద్య చికిత్సలతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.