ఎన్నెపల్లి చౌరస్తా ఇకపై అంబేద్కర్ చౌరస్తా.....!

వికారాబాద్: ఎన్నెపల్లి చౌరస్తా ఇకపై అంబేద్కర్ చౌరస్తా.. వికారాబాద్ పట్టణంలోని ఎన్నేపల్లి కూడలి వద్ద దిమ్మెను తొలగించారు. త్వరలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం స్థాపించనున్నట్టు సమాచారం. దీంతో ఈ చౌరస్తాను ప్రజలు అంబేద్కర్ చౌరస్తాగా గుర్తించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.