ఈనెల 24వ ఉచిత వైద్య శిబిరం

సూర్యాపేట: మఠంపల్లి మండల కేంద్రంలోని చర్చి ఆవరణలో ఈనెల 24న స్థానిక శుభోదయ యూత్, ఫాదర్ మార్టిన్, చర్చి పెద్దల ఆధ్వర్యంలో ఉచిత మహిళా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు శుభోదయ యూత్ అధ్యక్షుడు జయభారత్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సంయుక్తారెడ్డి పాల్గొంటారని తెలిపారు.