హర్మన్‌ సేనకు మోదీ కీలక పిలుపు

హర్మన్‌ సేనకు మోదీ కీలక పిలుపు

మహిళల క్రికెట్ జట్టు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హర్మన్‌ సేనకు మోదీ కీలక పిలుపునిచ్చారు. 'ఫిట్ ఇండియా' సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చేయాలని కోరారు. ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ఫిట్‌గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం చేయాలని తెలిపారు. పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఇవన్నీ బోధించాలని సూచించారు.