'అన్ని సమస్యలు పరిష్కరించాలి'

'అన్ని సమస్యలు పరిష్కరించాలి'

MNCL: హాస్టల్లో అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. శుక్రవారం హాజిపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన పరిశీలించి సర్వే చేశారు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు.