మీసేవ కేంద్రాలపై ఏసీబీ దాడులు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు మీసేవ కేంద్రాలపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. సామాన్య ప్రజల నుంచి సేవల కోసం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో ఈ తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్రాల వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.