సూళ్లూరుపేటలో సైబర్ నేరాలపై అవగాహన
TPT: సూళ్లూరుపేట SBI బ్యాంకులో సైబర్ నేరాలపై ఎస్సై బ్రహ్మ నాయుడు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సైబర్ మోసాలను గుర్తించే విధానాలు, నివారణ చర్యలను వివరించారు. అనుమానాస్పద లింకులుపై, తెలియని ఈమెయిల్‌పై క్లిక్ చేయవద్దని, సిమ్ స్వాప్ వంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే తమ డబ్బు, డేటా భద్రంగా ఉంటుందని ఆయన తెలిపారు.