'లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి'

'లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని CP అంబర్ కిషోర్ ఝా మంగళవారం పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీమార్గంలో పరిష్కారం అవుతాయని తెలిపారు. చిన్నచిన్న తగాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బువృథా చేయవద్దన్నారు. రాజీకి అనువైన కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.