VIDEO: జిల్లాలో పులి సంచారం కలకలం
KKD: పరిమితడక- జడ్డంగి అన్నవరం గ్రామాల మధ్య పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. గ్రామ సమీపంలోని పామాయిల్ తోటలో రాత్రి వేళలో పొలంలో కట్టివున్న గేదెపై పులి దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. ఉదయం రైతులు పొలాలకు వెళ్లగా గేదె కళేబరం కనిపించడంతో పులి సంచారం వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.