రూ.613 కోట్లతో 4.36 లక్షల మందికి మంచినీరు!

HYD: ORR ప్యాకేజీ-1లో రూ.613 కోట్లతో 33 సర్వీస్ రిజర్వాయర్లు, 1,522 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ ప్యాకేజీ పరిధిలో సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర మండలాలు ఉన్నాయి. దీని ద్వారా మొత్తం 4.36 లక్షల మందికి మంచినీరు అందనుంది.