పాఠాలు చెప్పలేదని బాలుడికి వాతలు పెట్టిన టీచర్

పాఠాలు చెప్పలేదని బాలుడికి వాతలు పెట్టిన టీచర్

TG: HYD ఫిల్మ్‌నగర్ PS పరిధిలో దారుణం జరిగింది. షేక్ పేటకు చెందిన ఒకటవ తరగతి చదువుతున్న బాలుడు ఎప్పటిలాగే ట్యూషన్‌కు వెళ్లాడు. అయితే పాఠాలను సరిగా చెప్పలేదని ఆ బాలుడు శరీరంపై టీచర్ 7 చోట్ల అట్లకాడతో వాతలు పెట్టింది. దీంతో అతను నడవలేని స్థితికి చేరడంతో గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారిస్తున్నారు.