'ప్రజలను చంపేవారు దేశ భక్తులు ఎలా అవుతారు?'

'ప్రజలను చంపేవారు దేశ భక్తులు ఎలా అవుతారు?'

ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి తావులేదని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టులు తమ ఉనికి కోసమే పోరాడుతున్నారని చెప్పారు. మావోయిస్టులను భగత్ సింగ్, బిర్సాముండా వంటి వారితో అసలు పోల్చకూడదని తెలిపారు. ప్రజలను చంపేవారు దేశ భక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు. మావోయిస్టులు తమ సిద్ధాంతాన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని విమర్శించారు.